Sunday, March 23, 2014

Okariki Neevu Sahaayam Cheyalanukunte



--
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

Friday, June 22, 2012

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది, కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...!

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది,
కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...! @ భారతీయులం | Karthik Garu 

Monday, June 4, 2012

చరిత్ర లో ఈరోజు june 4,పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు జన్మించాడు.

చరిత్ర లో ఈరోజు june 4
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
బూదరాజు రాధాకృష్ణ ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.@ భారతీయులం  

Saturday, June 2, 2012

మనలో కలిగే ఒత్తిడి వలన మనలో జరిగే కొన్ని నష్టాలు మీ కోసం. ఒత్తిడిని ఎదురు కొండి ! తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి.

ఒత్తిడిని ఏదైనా శారీరక, రసాయనిక లేక భావావేశపూరిత, ఉద్విగ్నభరితమైన ఆంశంగానైనా పరిగణించవచ్చు, అలాగే, శారీరక లేక మానసిక అశాంతిని, ఆందోళనను కలిగించడంతో ఈ వ్యాధి సంక్రమించడానికి ఇది ఒక హేతువుగా, సకారణయుతమైన అంశం కూడా కావచ్చు. ఒత్తిడిని కలుగజేసే శారీరక మరియు రసాయనిక అంశాలు తీవ్ర గాయం, అఘాతం, అంటురోగాలు, జీవ విషాలు (టాక్సిన్స్), అనారోగ్యం మరియు ఏ విధమైన ఇతర గాయాలతోనైనా కూడి వుండవచ్చు. ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనేకమై, వివిధ రకాలుగా కూడా ఉంటాయి. 'ఒత్తిడి' అనే మాట మానసిక ఒత్తిడితో సంబంధం కలగినదిగా భావిస్తున్నప్పటికీ, శాస్త్రజ్ఞులు మరియు వైద్యులు మాత్రం ఇదే మాటను శరీరం నిర్వహించే విధులలో స్ధిరత్వాన్ని మరియు సమతుల్యతను మందగింపచేసే ఒక బలీయమైన శక్తిగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. తమ చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నప్పుడు దాని ద్వారా ఒత్తిడికి గురైనట్లు భావించే చాలామంది తమ శరీరాలు రసాయనాలను రక్తంలోకి విడుదల చేస్తున్నట్లుగా ప్రతిస్పందిస్తారు. ఇటువంటి రసాయనాలు వీరికి ఎంతో శక్తిని మరియు బలాన్ని కలుగజేస్తాయి.

తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి. ఉదాహరణకుః ఒక ప్రోజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహస్తున్నప్పుడు తక్కువ స్ధాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగలిగేటట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది, ఒత్తిడిలో రెండు రకాలున్నాయిః స్ట్రెస్ ('అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి') మరియు డిస్ట్రెస్ ('ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి') ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్ మరియు అదనపు బరువు. ఒత్తిడి ఉధృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్నప్పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది.@ భారతీయులం  

Friday, June 1, 2012

హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ఎయిడ్స్ ఇలా వ్యాపించదు.AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట.

విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాదిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాదిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.

ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.


ఎయిడ్స్ ఇలా వ్యాపించదు
ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు
    దోమ కాటు,పిల్లుల కాటు,కుక్క కాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల
    స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
    వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన,ఒకే మరుగు దొడ్లను, ఒకే స్విమ్మింగ్ పూల్‌‌లను ఉపయోగించటం ద్వారా
    ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
    ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
    హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.@ భారతీయులం  

చరిత్ర లో ఈరోజు june 1,అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1), ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది., భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది. etc.,

చరిత్ర లో ఈరోజు june 1
అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1): 1948వ సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
1930: భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది.
1955: అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
1968: హెలెన్‌ కెల్లర్‌ మరణించింది.
1975: ఒలంపిక్‌ క్రీడలలో పతకం సాధించి న తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జన్మించింది.
1979: విజయనగరం జిల్లా యేర్పాటు. 
1996: భారత మాజీ రాష్టప్రతి, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరణం.
2001: నేపాల్‌ రాజ ప్రాసాదంలో రాకుమా రుడి మారణకాండ.@ భారతీయులం  

Thursday, May 31, 2012

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో.....ధూమపానం - దుష్ర్పభావాలు...పిల్లలపెై ప్రభావం...భారత దేశ నేపథ్యం...సిగరెట్‌ వల్ల కలిగే హానీ..

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి చూడవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన నగరాలలో అయితే ఆడవారు కుడా ధూమ పానం చేస్తున్నారనుకోండి. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి, వారి ఆయువు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం ఆయు వు తగ్గుతుందని, ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పు డో వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అయినా ఎవ్వరూ ధూమపానం మానకుండా, వారి ఆరోగ్యమే కాకుండా పక్కవారి ఆరోగ్యా న్ని కూడా నాశనం చేస్తున్నారు. ప్రపంచమం తా ఈరోజు పొగాకు వ్యతిరేకదినం అని తెలి సినా, మన వాళ్ళెవరికీ పట్టనట్లు గుప్పుగుప్పు మంటూ దమ్ము కొడుతున్నారు.

 ప్రభుత్వం బహి రంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఓ చట్టాన్ని చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మో కింగ్‌ అండ్‌ హెల్‌‌త ప్రొటెక్షన్‌ యాక్ట్‌' కింద బ హిరంగ ప్రదేశాలు, ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాల్లో పొగతాగరాదు.

పొగాకు వ్యతిరేక దినం...
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశా లు ప్రజలలో పొగాకు వినియోగం వల్ల కలిగే హాని పట్ల అవగాహన పెంచి, అప్రమత్తుల్ని చేసే లక్ష్యంతో ధూమపాన వ్యతిరేక దినోత్స వాన్ని పాటించాలని భావించాయి. తదనుగు ణంగా 1988 నుంచి ప్రతి సంవత్సరం మే 31న ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారోగ్యం గురించి తెలియ జెప్పడమే ముఖ్య ఉద్దే్యశంగా పెట్టుకు న్నాయి. సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్ర భుత్వ ఉద్యోగ సంఘాలు, అన్ని పాఠశాలలు ఈ రోజు స్వచ్ఛందంగా ర్యాలీలు, సభలు, స మావేశాలు జరిపి ధూమపానం వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.

ధూమపానం - దుష్ర్పభావాలు...
మన దేశంలో సంవత్సరానికి దాదాపు 90 వేల మంది ప్రజలు పొగాకు వల్ల సంభవించే రోగాలతోనే మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పురుషులలో 56.4 శాతం, స్ర్తీలలో 44.9 శాతం కాన్సర్లకు కారణం పొ గాకు వాడకం వల్లే. ప్రపంచంలో ఎక్కడా లే నంత ఎక్కువగా గొంతు కాన్సర్‌ భారత దేశం లో వ్యాపిస్తోందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సిగరేట్‌ తాగగానే నికోటిన్‌, ఇతర రసాయ నాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాన్ని చూ పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసా రి సిగరెట్‌ తాగితే చాలా రకరకాల రసాయ నాలు శరీరంలోకి వెళ్తాయి. శరీంలోకి ప్రవే శించిన రసాయనాల్లో దాదాపు 40 నుండి 50 క్యాన్సర్లను కలిగించేవే. వాటితో పాటు తారు, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటివి శరీరం లోకి ప్రవేశిస్తాయి. మాములుగా ఊపిరి తి త్తుల్లో తమను తాము శుభ్రం చేసుకునే యం త్రాంగం ఉంటుంది. ఈ అలవాటు వలన అవి తమ సామార్థ్యాన్ని కోల్పోతాయి. ఆ కా లుష్యాన్ని బయటికి తీసుకురావడానికి పొడి దగ్గు మొదలవుతుంది.
                                 దీనినే స్మోకర్స్‌ కాఫ్‌ అని అంటారు. ప్రపం చంలో పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్‌ కేసుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. భారతదేశంలో పురుషుల్లో క్యాన్సర్‌ వ్యాధికి 56.4% కారణం కాగా మహిళల్లో 44.9% కారణమయ్యింది. ఊపిరితిత్తులకు వచ్చే క్యా న్సర్‌ 82%, ఇతర వ్యాధులకు 90% కార ణం పొగాకు వాడకం మాత్రమే. పొగాకు వా డకం గుండె రక్తనాళాల వ్యాధికి దారితీస్తుంది. ఇంకా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హృద్రో గంతో ఆకస్మిక మరణం, మెదడుకు పక్షవా తం, నాడి సంబంధ వ్యాధులకు కూడ పోగా కు ద్రోహదం అవుతున్నట్లు తెలుస్తుంది.

పిల్లలపెై ప్రభావం...
సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా పిల్లల్లో అస్తమా రోగుల సంఖ్య నానాటికి పెరుగు తోంది. ధూమాపానం ద్వారా వచ్చే పొగ వలన న్యుమోనియా లేదా శ్వాసతో పాటు వచ్చే దగ్గు (పల్మోనరీ బ్రాంకైటిస్‌) ఉత్పన్న మవుతుంది. పిల్లలో వినికిడి, వాచక సమ స్యలు తలెత్తుతాయి. ధూమాపానం చేసే వారి ఇండ్లలో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారిలో వ్యాధినిరోధక సమస్యలు ఉత్పన్న మవుతాయి. ఈ కారణం గా పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా తయారవుతారు.
ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒక రు మృతి చెందుతున్నట్లు తెలుస్తుంది. అందు లో భాగంగా భారతదేశంలో పొగాకు వాడకం వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమవుతుం ది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజోన్‌ హర్మోన్ల సంఖ్య తగ్గుతుంది. అరగంటసేపు పొగాకును నమిలితే 4 సిగరెట్లు తాగడంతో సమానమైన నికోటిన్‌ను మింగినట్లవుతుంది. పొగాకు నమిలేవారిలో నోరు, గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఆరోగ్యవంతులకంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెైద్యులు చెబు తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధాన 8 వ్యా ధులలో 6 వ్యాధులకు పొగాకు ఉమ్మడి రిస్క్‌ గా ఉంటుంది. మొత్తంగా 20వ దశాబ్దంలో 100 మిలియన్ల మరణాలు కేవలం పొగాకు సంబంధితంగా సంభవించినట్లు సర్వేలు తెలుపుతున్నాయి

భారత దేశ నేపథ్యం...
* మనదేశంలో సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు పొగాకు సంబంధమైనవిగా ఉంటున్నాయి.
* రోజూ 2200 మందికిపెైగా భారతీయులు పొగాకు వాడకం సంబంధిత మరణాలకు గురవుతున్నారు.
* రోజూ కొత్తగా 5500 మంది యువత పొగతాగేవారి జాబితాలో చేరుతున్నారు.
* ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 
నోటి క్యాన్సర్‌ కేసులు భారతదేశంలో నమోదవు తున్నాయి. వీటిలో 90 శాతం పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి.
* భారతదేశంలో నమోదవుతున్న 
మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు వివిధ రూపాల్లో పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నవే.

సిగరెట్‌ వల్ల కలిగే హానీ..
1. ధూమపానం వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి.
2. శ్వాసనాళంపెై గోడలు గట్టిపడి వదిలే గాలిలోని మలినాలు బయటకు పోవడం తగ్గిపోతుంది.
3. సంకోచ, వ్యాకోచాలు తగ్గి క్రానిక్‌ బ్రాం కైటిస్‌, ఆఫ్‌స్లైక్టివ్‌ పల్మనరీ వ్యాధులు వస్తాయి.
4. కడుపులో ఉదరకోశ పొరలు దెబ్బతిని అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, సమస్యలు తలెత్తుతాయి.
5. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని బిపి, గుండెపోటు సంభవిస్తాయి.
6. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవా తం, నరాల బలహీనత ఏర్పడుతాయి.
7. ఆయాసం పెరిగి ఇసినోఫిలిస్‌, గ్యాలినోమా అనే వ్యాధికి దారితీస్తుంది.@ భారతీయులం 

చరిత్ర లో ఈరోజు may 28 ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే) పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్‌.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.

చరిత్ర లో ఈరోజు may 28
ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే)    
పొగాకు వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే - మే 31): పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్‌.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.1953 నుండి ప్రతి సంవత్సరం ఈ తేదీన ప్రపంచ మంతటా 'నో స్మోకింగ్‌ డే' నిర్వహిస్తారు.
 దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం.
క్రీ.శ 526: టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1930: సుప్రసిద్ధ అమెరికన్‌ నటుడు, దర్శకుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ జననం.@ భారతీయులం 

మీకు తెలుసా ? మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి. అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొ నడీకణాలు 10 బిలియనులు.

మీకు తెలుసా ?
మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి.
అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొ నడీకణాలు 10 బిలియనులు
నాడీ వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.

సౌలభ్యంకోసం నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.
1. కేంద్ర నాడీ వ్యవస్థ (Central nervous system:CNS) - మెదడు మరియు వెన్నుపాము.
2. పరిధీయ నాడీ వ్యవస్థ (Peripheral nervous system:PNS) - కపాల నాడులు మరియు కశేరు నాడులు.
3. స్వయంచోదిత నాడీ వ్యవస్థ (Autonomous nervous system:ANS).

గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను చాలక నాడులు.

నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.
నాడీ కణాలు (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు మరియు ఏక్సాన్.
నాడీ కణదేహం (Cell body) లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు (Nissle substance) ఉంటాయి.
డెండ్రైట్లు (Dendrites) చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
ఏక్సాన్ (Axon) ప్రతి కణదేహం నుండి బయలుదేరే ఒక పొడవైన అక్షీయ తంతువు. దీనిని ఆవరించి పలుచని ప్లాస్మాత్వచం మయెలిన్ తొడుగు (Myelin sheath) ఉంటుంది. ఈ ఏక్సాన్ చివరిభాగం నాడీ అంత్యంతో అంతమవుతుంది. నాడీఅంత్యం మరో నాడీకణ డెండ్రైట్ లేదా ఏక్సాన్ లేదా నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులతో సంబంధం కలిగివుంటుంది. నాడీకణ ఏక్సాన్లు నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ (Synapse) అంటారు. మయెలిన్ తొడుగులో అక్కడక్కడ కనిపించే ఖాళీ ప్రదేశాలను రాన్వియర్ కణుపులు (Nodes of Ranvier) అంటారు. మయెలిన్ తొడుగున్న ఏక్సాన్లు వార్తలను వేగంగా తీసుకొని వెళతాయి.
గ్లియల్ కణాలు (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.@ భారతీయులం 

--

బలవంతుడ నాకేమని పలువురతో విగ్రహించి పలుకుటమేలా? (సుమతీ శతకము) @ భారతీయులం

కం|| బలవంతుడ నాకేమని
పలువురతో విగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! (సుమతీ శతకము) @ భారతీయులం 

Tuesday, May 29, 2012

చరిత్ర లో ఈరోజు may 28,వినాయక దామోదర్‌ సావర్కర్‌ జన్మించాడు.,సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు. ,జేమ్స్‌బాండ్‌ జయంతి,ఎన్టీరామారావు జయంతి

చరిత్ర లో ఈరోజు may 28
1883: వినాయక దామోదర్‌ సావర్కర్‌ జన్మించాడు.

1896: సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు. 
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఏర్పాటు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడేందుకు మే 28, 1961న 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' పునాదులు పడ్డాయి. బ్రిటీష్‌ న్యాయవాది పీటర్‌ బెనెన్సన్‌ రాసిన 'ది ఫర్గా టెన్‌ ప్రిజనర్స్‌' అనే ఆర్టికల్‌ ఈ రోజున అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యింది. తరువాత ఇదే ఆయనను ఆమ్నెస్టీ ఇంటేర్న షనల్‌ను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. 150 దేశాల నుంచి 11 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల అణిచివేత, మానవహక్కుల దుర్వి నియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటా లకు మద్దతునివ్వడం, మానవహక్కుల దుర్వినియోగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ సంస్థకు 1977లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.

జేమ్స్‌బాండ్‌ జయంతి: జేమ్స్‌బాండ్‌ పాత్ర సృష్టికర్త.. ఇయాన్‌ లాంకస్టర్‌ మే 28, 1908 లో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. తొలినాళ్ళలో రాయిటర్స్‌, టైమ్స్‌, సండే టైమ్స్‌ పత్రికల్లో పనిచేశాడు. 'ఫీల్డ్‌ గైడ్‌ టు బర్డ్‌‌స ఆఫ్‌ వెస్టిండీస్‌' అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకా కుండా పక్షి శాస్తవ్రేత్త కూడా అయిన జేమ్స్‌ బాండ్‌.. తన నవలలోని 'జేమ్స్‌బాండ్‌' పేరు డిటెక్టివ్‌ పాత్రకు బాగుంటుందని.. ఆ పేరే పెట్టాడు. ఈయన రచించిన నవల ఆధారంగా ఇంగ్లీష్‌లో డిటెక్టివ్‌ సినిమాలు తీశారు. ఇయా న్‌ ఫ్లెమింగ్‌ నవల ఆధారంగా.. 1962లో 'డాక్టర్‌ నో' అనే డిటెక్టివ్‌ సినిమా వచ్చింది. 1962 నుండి ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా జేమ్స్‌బాండ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన పాత్ర 'జేమ్స్‌బాండ్‌'.

ఎన్టీరామారావు జయంతి: విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో.. వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంప తులకు తేది 28 మే 1923లో జన్మించారు. 1947లో 'మనదేశం'తో ప్రారంభించి 1982 వరకు దాదాపు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మార్చి 29, 1982న 'తెలుగు దేశం' పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల కా లంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్టీరామారావు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా.. నవంబర్‌ 1న 'తెలు గు ఆత్మగౌరవ దినోత్సవం'గా జరపాలని ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరు తో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి ఏటా ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.
@ భారతీయులం 

Saturday, May 26, 2012

పొట్ట కూటి కోసం ఏపనైనా చేస్తాము అనేలా చేయిస్తున్న ఆకలి బాద మరియు బయం.ఓహ్ పోలీసు ఆ అవయాలను తీయమని కోరాడు అలా చేసి నందుకు వంద రూపాయిలు ఇస్తానన్నాడు.

ఖాకి బట్టలు వేసుకుంటే చాలు ఏదైనా చేయగలము, చేయించ గలము.
పొట్ట కూటి కోసం ఏపనైనా చేస్తాము అనేలా చేయిస్తున్న ఆకలి బాద మరియు బయం.

వాడి పేరు ఫిరోజ్, వయసు ౧౨.ఓహ్ పోలీసు ఆ అవయాలను తీయమని కోరాడు అలా చేసి నందుకు వంద రూపాయిలు ఇస్తానన్నాడు.
వంద రూపాయిలకి మృతి చెందిన వ్యక్తీ శరీర అవయవాలను ఎరుతున్న ఫిరోజ్. ఆ అవయవాలను ఏరి ఒక చోట చేర్చిన ఫిరోజ్ ఆ తర్వాత చాల అస్వస్థత కి గురి అయ్యాడు.
ఫిరోజ్ రైల్వే స్టేషన్ లో చెత్త కాగితాలు ఏరేవాడు ఐతే సంబందిత రైల్వే పోలీసు అలా చేయమని బెదిరించడం తో చేయక తప్పలేదు.అలా చేసినదుకు వంద కుడా ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ వాలు కేసు బుక్ చేసారు అండ్ డాక్టర్ కి చూపించారు ఫిరోజ్ ని కానీ అపటికే ట్రౌమా లో ఉన్నాడు డాక్టర్ తన ని చూసి పర్మనెంట్ ఫోబిక్ రి-ఆక్షన్ అని అన్నాడు.@ భారతీయులం 

Friday, May 25, 2012

సిగరేట్ తాగటం బలే షోకు కదా. ! షోకులకు పోయి చావును కోరుకోకండి. అసలు పొగ తాగడం ఎందుకు మానేయమని అంటారు ఎందుకోసం ? తాగడం వలనా ఎం కోల్పోతునాము ? ఎలా మానాలి ?

సిగరేట్ తాగటం బలే షోకు కదా. ! షోకులకు పోయి చావును కోరుకోకండి. 

అసలు పొగ తాగడం ఎందుకు మానేయమని అంటారు ఎందుకోసం ? తాగడం వలనా ఎం కోల్పోతునాము ? ఎలా మానాలి ?

చాలా మంది యువత మరియు తెలిసి తెలియని వయసు లో ఈ అలవాటు నేర్చుకుంటున్నారు పలానా హీరో లేదా,వాడు ఎవడో తాగాడు నేను తాగుతా....ఇలా ఎన్నో కారణాలు వ్యసనానికి.

శరీరంలోని అణువణువుకూ ప్రాణవాయువైన ఆక్సిజన్‌ని అందించే కీలక అవయవాలు ఊపిరితిత్తులు. వీటిలో ఉండే వాయునాళాల నుంచి గాలి బయటకు వస్తుంది. ఈ వాయునాళాల్లో అవరోధం ఏర్పడం వల్ల కలిగే వ్యాధే క్రానిక్ అబ్‌వూస్టక్టివ్ డిసీజ్ (సీవోపీడీ). గాలి పీల్చుకున్నప్పుడు వాయునాళాల్లో ఉండే మార్గాల ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ నాళాలు ముక్కు, నోటి నుంచి గాలిని తీసుకెళతాయి. సీవోపీడీ వచ్చినప్పుడు ఈ వాయుమార్గాలు కుంచించుకుపోతాయి. వీటి ద్వారా ప్రయాణించే గాలి తక్కువ అవుతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి మళ్లీ బయటకు రాలేదు. తద్వారా ఊపిరితిత్తులు బరువుగా, నిండుగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఛాతీ మొత్తం పట్టేసినట్టు ఉండడానికి కూడా కారణం ఇదే. 
సీవోపీడీకి పొగతాగడం (బీడీలు, సిగరేట్లు, హుక్కా) అన్నింటి కన్నా ముఖ్య కారణం. చాలామంది సీవోపీడీ ఉన్నవాళ్లు వారు ప్రస్తుతం ఆ అలవాటును మానుకున్నా, గతంలో పొగతాగే అలవాటున్నవాళ్లే అయివుంటారు. కొద్దిరోజులు ఆ అలవాటు కొనసాగినా ఊపిరితిత్తులకు నష్టం జరిగిపోతుంది. ఒక్కొక్కప్పుడు పొగతాగనివాళ్లకు కూడా సీవోపీడీ రావచ్చు. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉండడం వల్ల వీళ్లకు సీవోపీడీ రావచ్చు. వంటపొయ్యిల నుంచి వచ్చే పొగ, గదిని వెచ్చబరిచేందుకు పెట్టుకునే హీటర్ల నుంచి వచ్చే పొగ పీల్చినా సీవోపీడీ రావచ్చు. స్త్రీలలో సీవోపీడీ రావడానికి ప్రధాన కారణం ఇదే. బొగ్గుగనులు, సిమెంటు, టెక్స్‌టైల్స్, రసాయన పరిక్షిశమలు, ఆభరణాలకు పూతపూసే (ఎలక్షిక్టోప్లేటింగ్) చోట దుమ్ముతో కూడిన గాలి ఉన్నచోట, ధూళి, దుమ్ము ఎక్కువగా ఉండేచోట పనిచేసే వ్యక్తులు కూడా సీవోపీడీ బారినపడవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లకు సీవోపీడీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పొగ మానేయడమే చికిత్స
సీవోపీడీకి అందించే ప్రధానమైన చికిత్స, నివారణ పొగతాగడం మానేయడమే. రోజుకి రెండు సిగరేట్లు తాగుతున్నా పరిస్థితి దిగజారిపోతుంది. సిగట్టు లోని పొగ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాయునాళాలు కుంచించుకుపోవడానికి కారణం ఈ పొగే. దీని ఫలితంగా ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ శ్లేష్మం అంతో ఇంతో తెరుచుకుని ఉన్న నాళాలను మరింత మూసేస్తుంది. ఫలితంగా శరీరానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ను ప్రసరింపజేసే శక్తి తగ్గిపోతుంది. 

సీవోపీడీ నిర్ధారణ..
సీవోపీడీగా ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత వేగంగా సీవోపీడీని అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇల్లు, పనిచేసే వాతావరణం లాంటి అంశాల ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. సై్పరోమీటర్ అనే ప్రత్యేక పరికరం ద్వారా కొన్ని రకాల శ్వాస పరీక్షలు చేస్తారు. వీటి ఆధారంగా సీవోపీడీ తక్కువగా ఉందా.. ఓ మోస్తరుగా ఉందా... చాలా తీవ్రంగా ఉందా... అన్న విషయాలను నిర్ధారించవచ్చు. 

సీవోపీడీ... దశలు...
దగ్గు, దానితో పాటు శ్లేష్మం రావడం, కాస్త వేగంగా పనిచేసినా, వేగంగా నడిచినా ఊపిరి తగ్గుతున్నట్లు అనిపించడం లాంటి లక్షణాలుంటే సీవోపీడీ అప్పుడప్పుడే ప్రారంభమయిందనుకోవచ్చు.
విపరీతమైన శ్లేష్మంతో దగ్గు ఎక్కువగా రావడం, కాస్త పనిచేసినా, నడిచినా ఊపిరి తగ్గినట్టు అనిపించడంతో పాటు ఎటువంటి శారీరక శ్రమ ఉన్న పనయిగా కష్టంగా ఉండటం, ఇతరుల మాదిరిగా వేగంగా పనిచేయలేకపోవడం, ఏమాత్రం జలుబు చేసినా, ఇన్‌ఫెక్షన్ కలిగినా కోలుకోవడానికి వారాల తరబడి సమయం పడితే మధ్యరకం సీవోపీడీగా పరిగణించవచ్చు. 

విపరీతంగా ఎడతెరిపి లేకుండా శ్లేష్మంతో కూడిన దగ్గు, చిన్న పనికే ఊపిరాడకపోవడం, పగలూ రాత్రీ తేడా లేకుండా ఈ సమస్యతో ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, విపరీతంగా అలసిపోవడం, నీరసం, ఒక గదిలో అటూ ఇటూ నడవడం కూడా కష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కలేరు. కొంచెం పనికే విపరీతంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గదు. ఇలాంటి లక్షణాలుంటే తీవ్రమైన సీవోపీడీ ఉన్నట్టే. 

ఎలా మానాలి?
పొగతాగడం మానేయడానికి ప్రధానంగా కావలసింది మనోబలం. మీకంత బలం లేదని అనిపిస్తే డీఅడిక్షన్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. ఇందుకు సహాయపడే మాత్రలను కూడా డాక్టర్ సలహాతో వాడవచ్చు. 
మానేసేముందు ఏ రోజు అన్నది కచ్చితంగా నిర్ణయించుకోండి. మానడానికి ప్రయత్నిస్తున్నట్టు కుటుంబసభ్యులకు, స్నేహితులకు ముందుగానే తెలియజెయ్యండి. సిగరేట్లు మీ దరిదాపుల్లో ఉండకుండా చూసుకోండి. పొగ తాగాలన్న కోరిక కలిగించే ప్రదేశాలు, వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. 
ఎప్పుడూ బిజీగా ఉండండి. చేతుల్ని బిజీగా ఉంచండి. సిగట్టు తీసుకోవాలనిపించినప్పుడల్లా ఓ పెన్సిల్ని గానీ మరో వస్తువునైనా చేతిలోకి తీసుకోండి. తాగాలనిపించినప్పుడల్లా చూయింగ్ గమ్ నమలండి. తాజా పండ్లు, కూరగాయలు తినండి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి.@ భారతీయులం  

Thursday, May 24, 2012

ప్రియములేని విందు పిండివంటల చేటు .....పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ.

ప్రియములేని విందు పిండివంటల చేటు  
భక్తి లేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా 
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు ....విత్తనంబు మర్రి వృక్షంబున నెంత విశ్వదాభిరామ వినురవేమ.

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు 
కొంచెమయున నదియు గొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబున నెంత 
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు....విశ్వదాభిరామ వినురవేమ.

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేల
చాటు పద్య మిలను చాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం  

చరిత్ర లో ఈరోజు may 24, కామన్వెల్త్‌ డే: 1959లో ఈ రోజున ‘ఎంపైర్‌ డే’ ను ‘కామన్వెల్త్‌ డే’ గా మార్చారు.మొట్టమొదటి టెలీగ్రాఫ్‌

చరిత్ర లో ఈరోజు may 24
కామన్వెల్త్‌ డే: 1959లో ఈ రోజున 'ఎంపైర్‌ డే' ను 'కామన్వెల్త్‌ డే' గా మార్చారు.
1543: కోపర్నికస్‌ మరణించాడు.
1819: బ్రిటీష్‌ మహారాణి విక్టోరియా జన్మించింది.
1844: మొట్టమొదటి టెలీగ్రాఫ్‌ సందేశాన్ని మోర్స్‌ అనే శాస్తవ్రేత్త వాషింగ్టన్‌ డి.సి. నుండి బాల్టిమోర్‌కు ప్రసారం చేశాడు.
1875: సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ స్కూల్‌ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘఢ్‌ ముస్లిం యునివర్సిటీగా అవతరించింది.
1997: నల్లమల గిరిప్రసాద్‌ మరణించాడు
1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.
1954: ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఓక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది
1993: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.@ భారతీయులం  

Wednesday, May 23, 2012

ప్రపంచంలోనే మొట్ట మొదటి మానవ జీవి (మొదటి హోమో సాపిఎనస్) నిఎందేర్తాల్స్ వారు అని విజ్ఞాన పరిశోదనలు తెలుపుతున్నాయి. భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది.

ప్రపంచంలోనే మొట్ట మొదటి మానవ జీవి (మొదటి హోమో సాపిఎనస్) నిఎందేర్తాల్స్ వారు అని విజ్ఞాన పరిశోదనలు తెలుపుతున్నాయి. మొదట  హోమో సాపిఎనస్ 200,౦౦౦ ఏళ్ల నాటి వారు మరియు ఆఫ్రికా లో ఉండేవారు. తదుపరి వారి వలస వెళ్ళటం వలన 100 ,౦౦౦ ఏళ్ళకి ప్రపంచ వివిధ దేశాలకు వ్యాపించారు.
నిఎందేర్తాల్స్ వారు ఐదు నుండి ఆరు ఫీట్ ఉండేవారు.వాళ్ళకి ఎముకులు దృడంగా మరియు స్టర్డి ఎముకులు చాలా బలంగా ఉండేవారు మరియు వారికీ మెదడు పెద్దది మాములు మానవులకన్నా.
మానవ ఉనికిని మరియు వివిధ రహస్యాలను తెలియ జెప్పే వివరాలు ప్రపంచ లో రెండో స్తానం భారత దేశం ది. ఒక్కపటి భారతదేశం ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము.
ప్రాంతాల వారి గా విడదీసుకొని ఇప్పుడు ఇలా అయ్యింది ముక్కలు అవుతూ.
ఆఫ్రికా వాసులు వలస చేరి మానవ ఉనికిని భారతదేశానికి పంచినట్టు కొన్ని రుజువులు ఉన్నాయి...వారి లోని కొన్ని తెగలు మరియు జాతులు ఇలా కార్యరూపం దాల్చింది ఇప్పుడు.
భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది. భారత దేశ చరిత్ర అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్లతో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర.@ భారతీయులం  

చరిత్ర లో ఈరోజు may 23,మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది

చరిత్ర లో ఈరోజు may 23
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు జన్మించాడు.
1984: మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది
1995: జావా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మొదటి వెర్షన్‌ విడుదలైంది.
2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.@ భారతీయులం  

Tuesday, May 22, 2012

నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి..! నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి.

నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి..!
ప్రొద్దున్నే నిద్రలేవగానే తల దిమ్ముగా ఉన్నా, కడుపులో వికారంగా ఉన్నా, నిస్సత్తువగా ఉందనిపిస్తున్నా, తల నొప్పి వేస్తున్నా ఇవి మన శరీరం నీటిని కోరుకుంటోందనడానికి సంకేతాలు అని గుర్తించాలి. అందుకే నిద్రపోవడానికి ముందు కూడా మన పెద్దలు తలగడ పక్కనో, మంచం కిందనో రాగి లేదా సాధారణ చెంబులో నీళ్లు పట్టి ఉంచడం చేసేవారు. పొద్దున్నే నిద్రలేచి ముఖం కడుక్కున్న వెంటనే పిల్లలకు నీళ్లు తాగించేవారు. 

పొద్దుటిపూటే చెంబుడు నీళ్లు తాగితే రోజంతా చీకూ చింతా లేకుండా ఉంటారనే నమ్మకం వాళ్లది. వైద్య పరంగా కూడా దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా రాత్రి పూట భోంచేసింతర్వాత మరుసటి రోజు తెల్లవారే వరకూ ఏమీ పుచ్చుకోం గదా.. దీంతో శరీరం ఖర్చుపెట్టిన ద్రవపదార్థాల స్థానంలో నీరు వచ్చి చేరదు. శరీరం నీటిని కోరుకుంటున్నా మనం అందివ్వని స్థితి రాత్రిపూట ఉంటుంది కనుకే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల శరీరం తిరిగి రీచార్జ్ అవుతుంది.

నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, మూత్రపిండాలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే మనం వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి. 

శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఎంతో కొన్ని కెలోరీలు ఖర్చయిపోతుండడం ఎలా వాస్తవమో శరీరం తనలోని నీటి నిల్వను నిరంతరం ఖర్చు పెట్టుకుంటూనే ఉంటుందని గుర్చుంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం తప్పనిసరి వైద్యనిపుణులు సూచిస్తూంటారు.

అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కమలా పళ్లు, నారింజ, దానిమ్మ వంటి ఫలాలను ఆయా సీజన్‌లలో అధికంగా తీసుకోవాలి. అన్నిటినీమించి నిద్రలేస్తూనే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇదే కారుచౌక మార్గం... కాబట్టి నీరు తాగడం మానవద్దు, నీరు తాగడం మర్చిపోవద్దు. ప్రొద్దుటిపూట నీరు తాగడం అస్సలు మర్చిపోవద్దు.@ భారతీయులం  

Ads by Smowtion