చరిత్ర లో ఈరోజు june 4
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
బూదరాజు రాధాకృష్ణ ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.@ భారతీయులం
No comments:
Post a Comment