Saturday, March 31, 2012

మీకు తెలుసా ? ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది..రక్త దానం చేయడంలో కొన్ని పాటించాల్సిన నియమాలు.(చిట్కాలు)@ {భారతీయులం}

రక్త దానం చేయడంలో కొన్ని పాటించాల్సిన నియమాలు.(చిట్కాలు)
 మీకు తెలుసా ? ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది.
రక్తాన్ని దానం ఇవ్వాలనుకునే వాళ్ళు కనీసం 3 గంటల ముందు మంచి భోజనాన్ని తీసుకోండి.
1.దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
2.దానం చేసే రోజు ముందు పొగ త్రాగడం మానండి. దానం చేసిన 3 గంటల తరువాత మీరు పొగ త్రాగవచ్చు
3.దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.@ {భారతీయులం} 

నేను నా వంతు ప్రయత్నం చేశాను..ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఉపయోగించలేదు ! మరి మీరు ? @ {భారతీయులం}

నేను నా వంతు ప్రయత్నం చేశాను..ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఉపయోగించలేదు ! మరి మీరు ? పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చేసిన ఈ చిన్న ప్రయత్నం.@ {భారతీయులం} 

ప్రపంచం మొత్తం మౌనం పాటించే సమయం అది...ఒక్కసారిగా మన చేతులారా చేసుకున్న ఈ కాలుష్యం ఊభి లోంచి కొంత కాపాడుకునేందుకు చేసే చిన్న ప్రయత్నం ఈ "ఎర్త్‌ అవర్‌"@ {భారతీయులం}

ప్రపంచం మొత్తం మౌనం పాటించే సమయం అది...ఒక్కసారిగా మన చేతులారా చేసుకున్న ఈ  కాలుష్యం ఊభి లోంచి కొంత కాపాడుకునేందుకు ..చేసే చిన్న ప్రయత్నం ఈ "ఎర్త్‌ అవర్‌"  పర్యావరణాన్ని నాశనం చేస్తున్న మనమే దానిని రక్షించాల్సిన అవసరం కూడా ఉంది.  సమిష్టిగా అందరూ స్వచ్ఛందంగా వాతావరణ రక్షణకు పాటుపడినప్పుడే ఈ భూగోళాన్ని రక్షించుకోగలుగుతాము.  భారతదేశంలో ఢిల్లీ, ముంబాయి, చెనై్న, బెంగుళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలు పోటీపడుతున్నాయని ఇప్పటివరకు.
ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మార్చ్ ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణంలో జరిగే మార్పుల పట్ల ప్రజలలో అవగాహన కలిగించడమే.  ఈ నెల అంటే మార్చ్ 31వ తారీఖు రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు ఎర్త్ అవర్ జరుగుతుంది. 
ఎర్త్ అవర్ని సక్రమంగా జరిపి మన భూమికి, పర్యావరణానికి కొంతఅయినా మేలు చేద్దాం. @ {భారతీయులం} 

హైటెక్ రామవతారం.! మనవాడు లంకను కలుస్తున్నాడో ఏమో ? "రేడియో ..టీవీ ..ఇంటర్నెట్టు ...సెల్ ఫోనూ.. అన్నీ బ్లాంక్ ఐపోయాయన్నా !!"@ {భారతీయులం}

హైటెక్ రామవతారం.!
మనవాడు లంకను కలుస్తున్నాడో ఏమో ?
"రేడియో ..టీవీ ..ఇంటర్నెట్టు ...సెల్ ఫోనూ..
అన్నీ బ్లాంక్ ఐపోయాయన్నా !!"
ఈ కాలం లో మన రాముడు తిరిగి జన్మిస్తే ..బహుశా ఇలా చేసే వాడు ఏమో కదా.
ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు..ఇవి ౧౯౮౩ లో ఆంధ్రజ్యోతి లో వచ్చిన సురేఖా గారి చిత్రాలు.@ {భారతీయులం} 

హైటెక్ రామవతారం.! లక్ష్మణా ! సి లోన్ ట్యూన్ చెయ్ ! సీత వార్త లేమైనా..తెలుస్తాయేమో..! @ {భారతీయులం}

హైటెక్ రామవతారం.!
లక్ష్మణా ! సి లోన్ ట్యూన్ చెయ్ ! సీత వార్త లేమైనా..తెలుస్తాయేమో..!
ఈ కాలం లో మన రాముడు తిరిగి జన్మిస్తే ..బహుశా ఇలా చేసే వాడు ఏమో కదా.
ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు..ఇవి ౧౯౮౩ లో ఆంధ్రజ్యోతి లో వచ్చిన సురేఖా గారి చిత్రాలు.@ {భారతీయులం} 

హైటెక్ రామవతారం.! లక్ష్మణా ..గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి లంకలో సీత ఎక్కడుందో చూడు....!

హైటెక్ రామవతారం.!
లక్ష్మణా ..గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి లంకలో సీత ఎక్కడుందో చూడు....!
ఈ కాలం లో మన రాముడు తిరిగి జన్మిస్తే ..బహుశా ఇలా చేసే వాడు ఏమో కదా.
ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు..ఇవి ౧౯౮౩ లో ఆంధ్రజ్యోతి లో వచ్చిన సురేఖా గారి చిత్రాలు.@ {భారతీయులం} 

ఆ అలంకారణ చూసి ఔరా ! ఎంతటి వైభోగం. అని అబ్బరుపోఎలా..! రంగ వైభవంగా ఇంత గొప్పగా జరిగే మా సీతారాముల కళ్యాణం. చూతము రారండి.@ {భారతీయులం}

ఆ అలంకారణ చూసి ఔరా ! ఎంతటి వైభోగం. అని అబ్బరుపోఎలా..!
ఆశ్చర్య పోయే లా...కనీ విని ఎరుగని ముల్లోకాలలో..రంగ వైభవంగా ఇంత గొప్పగా జరిగే మా సీతారాముల కళ్యాణం. చూతము రారండి.

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...@ {భారతీయులం} 

" ఆ విల్లును వంచే దెవరు ? నా జత చేరే దెవరు ? " అంటూ రాసిన నా చెలి ముద్దు మాటలు మరిచేదెలా ? @ {భారతీయులం}

" ఆ విల్లును వంచే దెవరు ? నా జత చేరే దెవరు ? " అంటూ రాసిన నా చెలి ముద్దు మాటలు మరిచేదెలా ? @ {భారతీయులం} 

“శ్రీ రామ రామ రామేతి రమే రామె మనోరమే, సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే రామ నమ వరనన ఒం నమ ఇతి “ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.@ {భారతీయులం}

"శ్రీ రామ రామ రామేతి రమే రామె మనోరమే,
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే
రామ నమ వరనన ఒం నమ ఇతి "                       
అంటూ విశ్వనాధుడైన పరమశివుడే రామ నామము యొక్క విశిష్టతను మనకు తెలిపి,ఆయన పాద పద్మములే మన అందరికి శరణము అని ఉపదేశించినారు.
"రామ కోదండ రామ కల్యాణరామ
రామ సీతాపతి రామ నీవే గతి "
అంటూ రామ నామ మహత్యమును తెలిపి శరణాగతి మార్గమును మనకు అందించారు త్యాగరాజ స్వామి.
"శ్రీరామ చరణమే పల్లవై సాగింది ఆనాడూ..
  పాటగా మిగిలిందీ ఈనాడు.."
శ్రీ రామ రక్ష ని మించినది  ఏది లేదు.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.@ {భారతీయులం} 

"జీవితం ఒక సుందరమని కలగన్నాను , మెలకువవొచి చూస్తే అది స్వప్నమని తెలిసి నవ్వుకున్నాను .." మిత్రులందరికీ శుభోదయం !!! @ {భారతీయులం}

"జీవితం ఒక సుందరమని కలగన్నాను , మెలకువవొచి చూస్తే అది స్వప్నమని తెలిసి నవ్వుకున్నాను .." మిత్రులందరికీ శుభోదయం !!! @ {భారతీయులం} 

Friday, March 30, 2012

"ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నామామ్యహమ్ !" సీత రాముల కళ్యాణ శుభ వేడుకలు!! @ {భారతీయులం}

"ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం
   లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నామామ్యహమ్ !"
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
సీత రాముల కళ్యాణ శుభ వేడుకలు!! @ {భారతీయులం} 

పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు..పట్టాభి రామయ్య పరంధాముడు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు @ “భారతీయులం”

పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు
    పవమాన సుతుడు పాదాలు పట్టగా
        పట్టాభి రామయ్య పరంధాముడు
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు @ "భారతీయులం" 

రాగ్గింగ్ కి మరొకరు బలి అయ్యారు వరంగల్ లో ఇంజనీరింగ్ కాలేజీ లో. పరిస్థితి విషమం. రాగ్గింగ్ ని నిలదీయండి ..శ్రుతి మించి నప్పుడు. @ “భారతీయులం”

రాగ్గింగ్ కి మరొకరు బలి అయ్యారు వరంగల్ లో ఇంజనీరింగ్ కాలేజీ లో. పరిస్థితి విషమం.
రాగ్గింగ్ ని నిలదీయండి ..శ్రుతి మించి నప్పుడు. 
ఒక్క ఈమెయిలు చాలు ...తెలుసుకోండి తెలపండి మిత్రులారా. bharatiyulam@gmail.com www.no2ragging.org @ "భారతీయులం" 

ఒకరికి మంచి చేద్దాం అనుకోవడం నీ మూర్ఖత్వం ! ఒకరు నీ సలహాను వింటారు అనుకోవడం నీ వెర్రితనం.!! @ “భారతీయులం”

ఒకరికి మంచి చేద్దాం అనుకోవడం నీ మూర్ఖత్వం !
ఒకరు నీ సలహాను వింటారు అనుకోవడం నీ వెర్రితనం.!! @ "భారతీయులం"  

ఇలాంటి ఆచారాలకు ఇంకా ఆహ్వానం పలుకుతున్న వాళ్ళు ఉన్నారు..మూగ జీవం తో పెళ్లి చేస్తున్న వైనం.@ “భారతీయులం”

ఇలాంటి ఆచారాలకు ఇంకా ఆహ్వానం పలుకుతున్న వాళ్ళు ఉన్నారు..
తనకి ఏదో దోషం ఉంది అంటూ ... మూగ జీవం తో పెళ్లి చేస్తున్న వైనం.
ఇలాంటి ఆచారాలు ఇంకా ఉన్నాయి....తెలుసా మీకు.@ "భారతీయులం" 

అనుక్షణం నిరీక్షణం..నేస్తమా నువ్వెళ్ళిపోతావ్..ఎదురుచూస్తూ ఉంటా.. ఎనాడైనా ఈ కొమ్మలపై మరలా వాలతావని.@ “భారతీయులం”

అనుక్షణం నిరీక్షణం

నేస్తమా నువ్వెళ్ళిపోతావ్
నిన్న మనం సేదతీరిన చెట్టునే కాదు
నన్నుకూడా వదిలి.

నువ్వెళ్ళిపోతావ్
చిటారుకొమ్మన ఙ్ఞాపకాల ముడుపుకట్టి
సుడులు తిరిగే నా కన్నీళ్ళని జాలిగా చూస్తూ

నువ్వెళ్ళిపోతావ్
నేను మాత్రం ఉంటా చెట్టు నీడనే
పురుగులేరుకుతినే కోడిపుంజులా

సందెలు వాలిపోతాయి
నీడలు చీకట్లో కలిసిపోతాయి
ఎదురుచూస్తూ ఉంటా
ఎనాడైనా ఈ కొమ్మలపై మరలా వాలతావని.
@ "భారతీయులం" | మురళీధర్ గారు. 

ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోతావ్? ఈ దూరాలు చెరిపే అయుధం నీ వద్దే ఉంది.ఒక్క క్షణం గడువియ్యు. @ “భారతీయులం”

నేస్తమా.. నేస్తమా..నేస్తమా!
ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోతావ్?
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.

ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.

ఈ దూరాలు చెరిపే అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు.
@ "భారతీయులం" | మురళీధర్ గారు. 

నెట్ లో చిక్కుకోవద్దు.! ఇంటి వద్దే ఉంటూ ..నెలకు పది వేలు ..ముందు రెండు వేలు కట్టండి...నెలకు ఇరవై వేలు మీవే. ఇలాంటి ప్రకటనలు వెబ్ సైట్ లోఇదంతా నిజమేనా ? మీరు తెలుగుకోవాల్సిన విషయాలు కొన్ని..! @ భారతీయులం

నెట్ లో చిక్కుకోవద్దు.! ఇంటి వద్దే ఉంటూ ..నెలకు పది వేలు ..ముందు రెండు వేలు కట్టండి...నెలకు ఇరవై వేలు మీవే. ఇలాంటి ప్రకటనలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ముక్యంగా సామాజిక వెబ్ సైట్ లో...మరి ఇదంతా నిజమేనా ?
మీరు తెలుగుకోవాల్సిన విషయాలు కొన్ని..! @ భారతీయులం 

తెల్లవార వస్తోంది కొద్ది కొద్దిగా...తీరం చేరగలదని నమ్మకంగా...! మిత్రులందరికీ శుభోదయం !!!

 తెల్లవార వస్తోంది కొద్ది కొద్దిగా...

వాగ్దానమిచ్చిన ఉషోదయం ఇదేనని!

 జీవన నావ సాగుతోంది మెల్ల మెల్లగా...

తీరం చేరగలదని నమ్మకంగా...! 

 మిత్రులందరికీ శుభోదయం !!! 


Thursday, March 29, 2012

మీ ఊల్లో ఇలా కోస్తారా ? హ..హ....హ..... మా వూళ్లో కొబ్బరి కాయలు ఇలాగే కోసుకుంటాం..!@ భారతీయులం | Suryaprakash Josyula Garu.

హ..హ....హ.....
మా వూళ్లో కొబ్బరి కాయలు ఇలాగే కోసుకుంటాం........!
మామూలుగా..కొబ్బరి చెట్టు ఒకడే ఎక్కి కోస్తూండం .......వినడమే కాదు చూసాము కూడా..... మీ ఊల్లో ఇలా కోస్తారా ? @ భారతీయులం | Suryaprakash Josyula Garu. 

ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం...నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే..!@ భారతీయులం.

ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే..!
అమ్మ ని మరచిన వాడు మరణించిన వాన్ని తో సమానం.! @ భారతీయులం. 

బ్లాగ్ బాషలందు తెలుగు లెస్స.! ఇవిగో కొన్ని తెలుగు పలుకులను ముద్దుగా అలంకరించిన కొన్ని బ్లాగ్స్ ...అన్నిటిని ఒకే చోట ! @ భారతీయులం.

బ్లాగ్ బాషలందు తెలుగు లెస్స.! ఇవిగో కొన్ని తెలుగు పలుకులను ముద్దుగా అలంకరించిన కొన్ని బ్లాగ్స్ ...అన్నిటిని ఒకే చోట ! @ భారతీయులం.
ఈతరం తెలుగు బ్లాగ్స్ చూసి మురుసి పోతున్న తెలుగు ప్రేమికులు..కదలు,వార్తలు,కవితలు, వివిధ సూచనలు...ఒకటా ! ఎన్నో ఎన్నెన్నో...!
భారతీయులం తో మొదలై ఎన్నో విషయాలను తెలుగు అందిస్తున్న వారు ఎందరో.
తెలుగు లో ఇంత చక్కగా రాసే వారందరికి నా అభినందనలు...! ఇంకా తెలుగు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని చాటి చెప్తున్నదుకు.
భారతీయులం మీకు స్వాగతం పలుకుతుంది... మీరు మీ తెలుగు లో రాసే బ్లాగ్స్ లను మాకు ఈమెయిలు ద్వారా పంపగలరని తెలియ జేయుచున్నాము. bharatiyulam@gmail.com
ఎ మతము అయినా ఎ కులం అయినా ...నీవు భారతీయులం అని మరచిపోవద్దు మన మాతృ భాష ని మరువద్దు.. మాతృ బాష లో మాట్లాడటం తప్పు కాదు అని, తెలుగే మాకు ముద్దు అని చెప్దాం.
భారతీయులం ఇప్పటివరకు  ఎందరో అతిధులు వీక్షించారు. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ..! మీ భారతీయులం -(m&k) 

మీకోసం, మీరు ఎదురు చూసే ..మీ దిన పత్రిక వేచి వుంది..! శుభోదయం.@ {భారతీయులం}

మీకోసం, 
మీరు ఎదురు చూసే ..మీ దిన పత్రిక వేచి వుంది..! శుభోదయం.@ {భారతీయులం} 

ఓహ్ చేతికి సెలైన్ ..మరో చేతికి కలం.పదో తరగతి పరీక్షకు హాజరైన అమ్మాయి.@ {భారతీయులం}

ఓహ్ చేతికి సెలైన్ ..మరో చేతికి కలం.పదో తరగతి పరీక్షకు హాజరైన అమ్మాయి.@ {భారతీయులం} 

Wednesday, March 28, 2012

దేవుడే లేడు అని వాదిస్తారు కొందరు...మరి కొన్ని తరతరాల నాటి నుండి కాశి లో ఈ పూజలు ఎవరికోసం.నీరు ఎక్కడ నుండి వస్తుందో చెప్పలేరు ఎవ్వరూ !మా గంగాహారతులు.@ {భారతీయులం}

దేవుడే లేడు అని వాదిస్తారు కొందరు...
మరి కొన్ని తరతరాల నాటి నుండి కాశి లో ఈ పూజలు ఎవరికోసం.
దువుడు లేడు కానీ ఏదో ఒక మాయ మాత్రం ఉంది కదా...! ఈ సృష్టి ని ఇంత అందంగా చేసింది ఆ మాయే. 
దానిని కొందరు దేవుడు అని కొలుస్తారు కొందరు ఏదో సైన్సు అని అంటారు....
ఎంత సైన్సు అయినా దాని రహస్యం తెలియనంతవరకు అది పెద్ద సమస్య ..తెలిసాక ఇంతేనా అనిపించే మన స్వబావం.
కనిపించే దేవుడు ఆ సూర్యుడు ...సూర్యుడే లేనిది లోకం ఎక్కడిది ?
తరతరాలు కాదు కదా...ఎప్పటికి నీకు మేము ఇచ్చే మా హారతులు...గంగా ఎండిపోవడం అసాద్యం ! నీరు ఎక్కడ నుండి వస్తుందో చెప్పలేరు ఎవ్వరూ !
అందుకో మా గంగాహారతులు.@ {భారతీయులం} 

వారణాసి లో ఓహ్ సన్యాసి..తన కురులను ఆరబెట్టుకుంటున్నాడు. తన కురులను చూసి ఆశ్చర్య పోయాము.@ {భారతీయులం}

వారణాసి లో ఓహ్ సన్యాసి..తన కురులను ఆరబెట్టుకుంటున్నాడు. తన కురులను చూసి ఆశ్చర్య పోయాము.@ {భారతీయులం} 

వేడి వేడి జిలేబి, జిలేబి సోదరుడు...! @ {భారతీయులం}

వేడి వేడి జిలేబి,
జిలేబి సోదరుడు...! @ {భారతీయులం} 

ఇది సరదాక .. కావాలని చేస్తుందా ? రాగింగ్ ఇదో గొప్ప.మీరు రాగ్గింగ్ వల్ల బాదపడుతున్నారా ? @ {భారతీయులం}

ఇది సరదాక .. కావాలని చేస్తుందా ?
ఏదైనా సరే కానీ మితి మీర కుండా ఉంటె చాలు.
బయపడుతూ ఉండే జూనియర్ కి సీనియర్ ఒక అండగా ఉండాలి....కలిసి మెలిసి అన్న తమ్ముల్లా ఉండాలి.
సరదాగా పేరు అడుగు ..వివరాలు అడుగు కానీ శ్రుతి మించకూడదు.!
రాగింగ్ ఇదో గొప్ప ..ఇప్పటివరకు అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా ఏమి తక్కువలేరు...
ఒకరినిఒకరు తెలుసుకోవడం అని అంటారు సీనియర్ వాళ్ళు ...లేదు హింస అంటారు జూనియర్ వాళ్ళు..
కానీ ఏదైనా మన వాళ్ళు అయ్యే వరకే...! మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది అన్ని ఒర్కనే అనలేదు.
కొంటె జూనియర్ లు లేక పోరు వాళ్ళ తోకలు కోసే సీనియర్ లు లేక పోరు.
మీరు రాగ్గింగ్  వల్ల  బాదపడుతున్నారా ? వెంటనే మాకు ఈమెయిలు రాయండి మీము మీకు అండగా ఉంటాము. @ {భారతీయులం} email to: bharatiyulam@gmail.com
  

ఇది ప్రేమంటారా ? ప్రేమించడం నేరం కాదు ...ప్రేమను శాశించడం పెద్ద నేరం... అలానే చావును ఆహ్వానించడం ఇంకా నేరం. @ {భారతీయులం}

ఇది ప్రేమంటారా ?
ప్రేమ మద్యలో వచ్చి మద్యలో పోతుంది ...అలాంటి దానికోసం చావు చివరి నిర్ణయం కాకూడదు..!
ప్రేమ ఎప్పుడు ఒకరి మరణం కోరుకోదు...చిన్న నాటి నుండి ప్రేమించిన పెద్దలను వదిలేసి ఏదో ఒక్క పువ్వు కోసం మన వంటినిండా ముళ్ళను గుచ్చుకోము కదా. ప్రతి ప్రశ్న కి ఏదో ఒక జవాబు ఉంటది...ప్రశ్న లేనిది జవ్వబు లేదుగా ? అలాగే మన ప్రేమకి కూడా సమయం ఉంటది..ఎవ్వనం లో పుట్టేది ఒక ప్రేమ ...దాని తరువాత పిల్లల మీద ఉండేది కన్న ప్రేమ ...మరి పిల్లలు పుట్టాక మనకి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైతది. అలాగే ఏదో పులి ని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు గా ఉంది కొందరి పరిస్తితి. ప్రేమించడం నేరం కాదు ...ప్రేమను శాశించడం పెద్ద నేరం... అలానే చావును ఆహ్వానించడం ఇంకా నేరం. @ {భారతీయులం}  

మా కోసం ఆకలినే కాదు కష్టాలను, కన్నీళ్లను అవమానాలను అన్నింటినీ భరించావు..మా కోసం ఇన్ని చేసిన నువ్వు ! మాకెందుకు అప్పుడే బారం అయ్యావు.@ {భారతీయులం}

మా కోసం ఆకలినే కాదు కష్టాలను, కన్నీళ్లను అవమానాలను, అన్యాయాలను దౌర్జన్యాలను, దాష్టీకాలను..

అన్నింటినీ...పంటి బిగువున భరించావు.

నువ్వు తిన్నా, తినకున్నా మాకోసం దాచి మరీ తెచ్చావు చంద్రుడు గోళ్ళలో తల్లికోసం తీసుకొస్తే, నువ్వు మాకోసం చేతుల్నిండా తెచ్చావు.

పేదరికపు జీవితం నీకులాగే మాకూ వద్దని కట్టెలమ్మావు పువ్వులమ్మావు పెద్ద చదువులు చదివించావు.

మా కోసం ఇన్ని చేసిన నువ్వు ! మాకెందుకు అప్పుడే బారం అయ్యావు. ఎందుకు ఈ పనులు ఈ వయసులో. @ {భారతీయులం}


భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. హాయ్ హలో నుండి నమస్కారం పద్దతిని పాటిద్దాం. @ {భారతీయులం}

భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. హాయ్ హలో నుండి నమస్కారం పద్దతిని పాటిద్దాం. @ {భారతీయులం}

మిత్రులందరికీ శుభోదయం !!! @ {భారతీయులం}

మిత్రులందరికీ శుభోదయం !!! @ {భారతీయులం} 

Tuesday, March 27, 2012

మాతృ బాష కి మరియు పరాయి బాష కి గల తేడా...@ {భారతీయులం}

మాతృ బాష కి మరియు పరాయి బాష కి గల తేడా...@ {భారతీయులం} 

అతని గురుంచి చెప్పనవసరం లేదు ? తెలియని వారు లేరు ...తన బొజ్జ నిండా ఉన్న పాటలతో ..కమ్మని స్వరం తో.. @ {భారతీయులం}

అతని గురుంచి చెప్పనవసరం లేదు ? తెలియని వారు లేరు ...
తన బొజ్జ నిండా ఉన్న పాటలతో ..కమ్మని స్వరం తో మమల్ని ఆనందపరిచే మా బాలు.@ {భారతీయులం} 

గాలి నిన్ను తాకింది,నేల నిన్ను తాకింది..ఏమిటంట నీలోని గొప్ప…@ {భారతీయులం}

గాలి నిన్ను తాకింది,నేల నిన్ను తాకింది..
నేను నిన్ను తాకితేతప్పా …
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది..
ఏమిటంట నీలోని గొప్ప…@ {భారతీయులం}  

మీరు రాసేవి వేరొకరు కాపీ కొడుతున్నారని బాద పడుతున్నారా ? రాసేవి వేరొకరు కాపీ చేయకుండా ఉండాలంటే ? ఇలా చేయండి @“భారతీయులం”

మిత్రులారా మీరు రాసేవి వేరొకరు కాపీ కొడుతున్నారని బాద పడుతున్నారా ?

మీ అందరికోసం నాదో చిన్న కిటుకు...

మనము రాసేవి వేరొకరు కాపీ చేయకుండా ఉండాలంటే ?

మీరు ఇలా చేయండి...

Step 1: HTML లేదా LAYOUT > HTML

Step 2:  <body>

Step 3: ఈ కోడ్ ని ondragstart="return false" onselectstart="return false" లో పెట్టాలి.

Step 4: ఇలా కనిపిస్తది కోడ్ పెట్టిన తర్వాత,

<body bgcolor="#FFFFFF" ondragstart="return false" onselectstart="return false">

Step 5: సేవ్ (save) చేయండి.


ఇప్పుడు మీరు రాసే దేనినైన వేరే వాళ్ళు కాపీ చేయలేరు.

నచ్చిందా మిత్రమా ? 


శ్రీరాముని దయచేతను....నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! @ {భారతీయులం}

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను. @ {భారతీయులం}  

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది...విశ్వదాభిరామ వినురవేమ! @ {భారతీయులం}

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగుబర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినురవేమ! @ {భారతీయులం}  

Saturday, March 24, 2012

గురువులు ప్రధానముగా ఏడు రకములు అని మన శాస్త్రాలలో చెప్పబడింది.@ {భారతీయులం}

గురువులు ప్రధానముగా ఏడు రకములు అని మన శాస్త్రాలలో చెప్పబడింది. అది ఎవరనగా:
సూచక గురువు - చదువు చెప్పేవాడు
వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు
విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు. @ {భారతీయులం}
  

చరిత్రలో మార్చి 24: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం @ {భారతీయులం}

చరిత్రలో మార్చి 24:
1603: 44 సంవత్సరాలు పాలించిన బ్రిటీషు మహారాణి ఎలిజబెత్‌ మరణించారు.
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయి ప్రమాణ స్వీకారం
* ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం @ {భారతీయులం}
-=-=-=-=-=-=-==--=-=-=-=-
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం : తెలుసుకోండి తెలపండి World TB Day
You can prevent yourself from disease and keep yourself healthy by eating loads of fruits and vegetables, exercising daily, stopping the consumption of alcohol and smoking.

You can help to prevent the spread of TB by covering your mouth if you are coughing and sneezing, keeping windows in houses, taxis, buses and other places open for movement of fresh air, not spitting on the ground and not stopping your TB treatment and medication even if you are sense better. @ {భారతీయులం} 

How to kiss ? Few Tips for Kissing.

There Are Few Tips For "Kissing".
  1. Breathe Comfortably
  2. Have Moist Lips
  3. Close Your Eyes
  4. Reaction Must Be Understood
  5. After You Kiss, Look Down
  6. Try Not To Speak With A Kiss
  7. Never Be Afraid When You Kiss
  8. Brush Teeth Before You Kiss
  9. Smell Good
  10. Don’t Hesitate If You Feel Like Kissing
  11. Don’t Use Lipstick Or Lip Gloss Before You Kiss
  12. Kisses With The Right Mood
  13. The Right Mood Must Be Set
  14. Be Comfortable To Kiss
  15. Never Nervous
  16. Be Positive And More
  17. Never Smoke Before You Kiss
  18. Remember To Be Alone While You Kiss
  19. Remember, Guys Like To Kiss
  20. Enjoy Kiss

Kiss How To Kiss ? Wallpapers

Kissing Couples
Kissing Couples
How To Kiss?
How To Kiss?
Kissing Couples
How To Kiss?
How To Kiss?

Ads by Smowtion