మా కోసం ఆకలినే కాదు కష్టాలను, కన్నీళ్లను అవమానాలను, అన్యాయాలను దౌర్జన్యాలను, దాష్టీకాలను..
అన్నింటినీ...పంటి బిగువున భరించావు.
నువ్వు తిన్నా, తినకున్నా మాకోసం దాచి మరీ తెచ్చావు చంద్రుడు గోళ్ళలో తల్లికోసం తీసుకొస్తే, నువ్వు మాకోసం చేతుల్నిండా తెచ్చావు.
పేదరికపు జీవితం నీకులాగే మాకూ వద్దని కట్టెలమ్మావు పువ్వులమ్మావు పెద్ద చదువులు చదివించావు.
మా కోసం ఇన్ని చేసిన నువ్వు ! మాకెందుకు అప్పుడే బారం అయ్యావు. ఎందుకు ఈ పనులు ఈ వయసులో. @ {భారతీయులం}
No comments:
Post a Comment