మృదువైన పెదవుల వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
నాజూకుగా, మడతలు లేని పెదవుల వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. చక్కని మాయిశ్చరైజర్ వాడకంతో పెదవులు కూడా లేతగా కనిపిస్తాయి. పొడిపొడిగా, పగిలిన గీతతో ఉండే పెదవులకు, జెల్లీ బేస్ మాయిశ్చరైజర్ లేదా వ్యాజలిన్ రాస్తే సరిపోతుంది. నీరు సరిగ్గా తాగకపోవటం వల్ల పెదవులు ఎండిపోయినట్లుగా ఉంటే, వాటికి ఫ్రూట్ బేస్ లిప్ బామ్ రాయటం మేలైన పని. పెదవులు నల్లగానూ, ఎప్పుడూ శుష్కతతోనూ ఉంటే నిమ్మరసం, పన్నీరు, గ్లిజరిన్‌లతో ఒకటి రెండు పూతలు, రోజులో రెండు మూడుసార్లు పూయాలి. పెదవులు పగలకుండా ఉండేందుకు, రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు, హైడ్రేటింగ్ లిప్ బామ్ రాసుకోవాలి. దీన్ని పగటి పూట రాసుకునే పని లేదు. లిప్‌స్టిక్ ఉపయోగించని వారు కూడా లిప్ గ్లాస్ వాడకం అలవాటు చేసుకోవచ్చు. దీని వల్ల పెదవులు రోజంతా తగినంత తేమతో ఉంటాయి.@ భారతీయులం
No comments:
Post a Comment