Tuesday, May 1, 2012

చరిత్రలో ఈ రోజు - May 1, మే దినోత్సవం లేదా మే డే,మహారాష్ట్ర దినోత్సవం ,వృద్ధుల దినోత్సవం,ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు - May 1
1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).
మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం.చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్తిస్తాయి. 

1960: మహారాష్ట్ర దినోత్సవం 
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 
భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరవాతి స్థానం).  


1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్) 
ప్రతీ జీవికీ చావు పుట్టుకలు ఎంత సహజమో భూమ్మీద నూకలు బాగా ఉండి బతికితే ముసలితనం కూడా అంతే సహజం. జరామరణాలు, వ్యాధులు, బాధలు అంటేచాలు బెంగపడి మంచాలెక్కేవాళ్ళెందరో...!వయసు 60వ యేటికి చేరుతుంటే ప్రతీ ఒక్కరికీ మనసులో బాధ. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకు, పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసే వారికి అది రిటైర్మెంట్‌ను తెచ్చిపెట్టే వయసు. 60యేళ్ళు వస్తేయేం ఇంకా పనిచేయగల సత్తా ఉన్నా ఎందుకు రిటైర్‌ చేయించేస్తారు అని అమాయకంగా అడిగేవారు, వయసు సాకుగా చూపించి అనుభవాన్ని వదులుకుంటారా? వృద్ధులను సీనియర్లు అని పిలిచే సంప్రదాయం అమెరికాలోనూ యూరోప్‌లోనూ ఉంది. అలాగే ఆ దేశాలలోనే 65 సంవత్సరాలు దాటిన వారిని సీనియర్లు అని పిలవడాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నారు. రిటైరయ్యే వారికి దిగులులేకుండా బతకడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారక్కడి పాలకులు. కనుక అక్కడ రిటైరైన వారు గాలిలో దీపాలమైపోయామని దిగులుపడనక్కర్లేదు. ముసలితనం ముసలితనం అనడమేకాని చాలా మంది వయసు మీద పడ్డాకే చురుకు పాలు పెరిగి బ్రహ్మాండంగా పనిచేస్తుంటారు. 

1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు. 
స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్ కు గవర్నరు గా కూడా పనిచేసాడు. 
.........................
మే దినోత్సవం:
ఎప్పుడైతే బ్రిటన్ లో ఆవిరి యంత్రం కనిపెట్టబడి, అది పారిశ్రామిక విప్లవానికి దారి తీసిందో, అప్పుడే కార్మిక వర్గం పురుడుపోసుకుంది భూస్వామ్యంలో కార్మికులు లేరు. వ్యవసాయానికి అనుబంధంగా వృత్తి. పనివారలు ఉండేవారు అంతే! కాని పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించబడి, నిరంతరాయంగా ఉత్పత్తి జరిగిన క్రమంలో కార్మికులు అదే స్థాయిలో పెరిగారు కాని విపరీతమైన పనిగంటలు , దుర్భరమైన పరిస్థితులు మళ్ళీ వారిలో స్పార్టకస్ ని మేల్కొలిపాయి.
బానిసతిరుగుబాట్లు జరిగినట్టుగానే , అమెరికాలో జరిగిన కార్మికవర్గ తిరుగుబాటు నుంచే 'మే డే' ఆవిర్భవించింది. 8 గంటలు పనిదినం, 8 గంట నిద్ర , 8 విశ్రాంతి కావాలంటూ అటు యూరప్ లోను, ఇటు అమెరికాలోని కార్మికులు ఉద్యమించారు. ఆ పోరాటం నుంచే ప్రపంచ కార్మిక వర్గం యొక్క భూమికను కర్తవ్యాల్ని ప్రకటిస్తూ 'మేడే 'ఇప్పటికీ తన వునికిని చాటుకుంటూనే వుంది.

19వ శాతబ్దంలో పెట్టుబడిదారులు కార్మికులను చేస్తున్న దోపిడిని గ్రహించి మార్క్సిస్టు మూల పురుషుడు  కార్ల్‌ మార్క్స్‌  ప్రపంచ కార్మికులారా ఏకం కండి... పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప... అని ఇచ్చిన నినాదానికి కార్మికుల నుంచి ఉవ్వెత్తున స్పందిన వచ్చింది.  ఇంగ్లాండ్‌ యురోపియన్ దేశాల్లో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న సమయంలో అటు కార్మిక రంగం అంతే స్పీడుగా పెరిగింది. ఈ పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులను యాజమాన్యాలు, బానిసల్లా పనిచేయించుకునే వారు. కార్మికులకు కనీస సౌకర్యాలు, తగిన వేతనం, కల్పించకపోగా... రోజుకు 18- 20 గంటలు పనిచేయించే వారు. దీంతో కార్మికులు మొదటిసారిగా  1806లో తిరుగుబాటుకు చేశారు.  బ్రిటన్‌లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఆమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు యూరప్‌, ప్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలకు పాకింది. ఈ తిరుగుబాటు మొత్తానికి అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్స్‌ యూనియన్‌ నాయకత్వం వహించింది. చికాగో నగరంలో 1886మే 1న హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శన జరిపారు. ఈ ర్యాలీని చెదరగోట్టేందుకు అమెరికా ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో రెచ్చిపొయిన పోలీసులు ప్రదర్శనపై కాల్పులు జరిపారు. నలుగురు కార్మికులు తుపాకి తుటాలకు బలయ్యారు.  కాల్పులకు వ్యతిరేకంగా మే 4న మరో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఈ సభనూ చెదరగోట్టే  ప్రయత్నంలో భాగంగా పోలీసులు మరో సారి తన ప్రతాపాన్ని చూపారు. స్వైర విహరం చేశారు.  చికాగో లోని హే మార్కేట్‌ రక్తంతో పూర్తిగా తడిసి ముద్దైంది. అక్కడే అవర్బవించింది ఈ అరుణపతాకం అ విధంగా 1856 మే 1 ప్రపంచ కార్మిక వర్గ విప్లవపోరాట ఉద్య మ చరరిత్రలు రక్తాక్షారాలతో లిఖించదగింది. ఆనాటి పోరాటాలు ఒక్క చికాగో నగరమే కాక ప్రపంచం నలుమూలల వ్యాపించాయి. ఆ రకంగా 156 సంవత్సరాల క్రీతం మొదలైన మే డే దాదాపు 113 ఏళ్ల నుంచి మన దేశంలో వామపక్షాల ఆధ్వర్యంలోని కార్మికులు, ఉత్సవాలను జరుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక రూపాల్లో కార్మికులు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. @ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

No comments:

Post a Comment

Ads by Smowtion