ప్రస్తుతం అనుసరిస్తున్న వివాహ విధానాల ప్రకారం ఇప్పటి నియమ నిబంధనలకింద రిజిస్ట్రేషన్ చేయడమే కాక, అవసరమైన రికార్డులు, గణాంకాలను నిర్వహించేందుకు వీలుంటుంది. వైవాహిక జీవితంలో మహిళలపై లేనిపోని వేధింపులు తగ్గుతాయి. పిల్లల రక్షణ బాధ్యత, వారిపై ఎవరికి హక్కుంటుంది?, ఎవరి దగ్గర ఉండాలి?, వివాహం చేసుకునేవారి వయసు వంటివి రికార్డు చేస్తారు. భారతీయులై ఉండి, వివిధ మతాలను అనుసరించేవారు వారు ఎక్కడున్నారో ఆయా రాష్ట్రాల్లో తప్పనిసరిగా వివాహాల్ని రిజిస్టర్ చేసుకోవాలని 2006 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించింది.
2006 బాల్య వివాహాల చట్టం, ఇతర సంబంధిత చట్టాలకు సవరణలు చేయడానికి సంబంధించి 18వ లా కమిషన్ తన 205వ నివేదికలో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది.
వివాహం జరిగిన తర్వాత ఒకానొక గడువును నిర్ణయించి, ఆలోగా అన్ని మతాలవారూ వివాహాల్ని రిజిస్టర్ చేయించాలి. భారతదేశమంతటికీ వర్తించే 'వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఎలాంటి మినహాయింపులు లేకుండా తప్పనిసరిగా వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని దృష్టిలో ఉంచుకొని, గమనించి 1969 నాటి జనన, మరణ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి, వివాహాల రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇందువల్ల ఆయా రాష్ట్రాల వివాహ రిజిస్ట్రేషన్ చట్టాలకు భంగం వాటిల్ల కుండా చూడాలని కూడా కేంద్రం భావించింది.@ భారతీయులం
No comments:
Post a Comment